సాక్షి,హైదరాబాద్: సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 25 వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తులను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.