సాక్షి, యాదాద్రి: బీబీనగర్, ఎస్‌వోటీ పోలీసులు స్థానికంగా తయారవుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. కొంతమడుగు వేటూకూరి ల్యాబ్స్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 54 కోట్ల విలువైన 27 కేజీల మెఫెడ్రోన్ , 40 కేజీల అసిటోన్ లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడి చేసే సమయంలో మరో నలుగురు నిందితులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ ముఠా ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేసి నాగ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


