జగిత్యాల: తులసి నగర్‌లో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందాడు ఓ యువకుడు. ప్యాడ్ బ్యాండ్ సౌండ్స్‌కు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో తోపారపు జయంత్ (24) ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటి ముందు మిత్రులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు జయంత్. వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది ఘటనాస్థలిలోనే యువకుడికి సీపీఆర్ చేశారు. 108 అంబులెన్స్ స్పందించకపోవడంతో పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


