22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన | telangana government key decisions on Section 22A | Sakshi
Sakshi News home page

22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Sep 24 2026 8:19 PM | Updated on Sep 24 2026 8:38 PM

telangana government key decisions on Section 22A

సాక్షి,హైదరాబాద్: 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని భూ యజమానులకు ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లోని స్థలాలు లేదా ఆస్తులకు సంబంధించి అధికారిక అనుమతులు ఉన్నవారికి రిజిస్ట్రేషన్ల మార్గం సుగమం చేసింది.

జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏ,డీటీసీపీ వంటి అధికారిక సంస్థల నుంచి సరైన అప్రూవల్స్ లేదా అనుమతులు ఉన్న భూములకు ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీనివల్ల నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కేవలం 22ఏ జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది మధ్యతరగతి, సామాన్య ప్రజలకు భారీ ఉపశమనం లభించినట్లయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement