భార్య ఫోనులో బండారం.. తవ్వే కొద్దీ బయటపడుతున్న నోట్ల కట్టలు | ACB Raids Ex DSP Bhim Reddy Benami Properties | Sakshi
Sakshi News home page

భీమ్‌రెడ్డి బినామీలపై ఏసీబీ గురి.. ఏసీబీ సోదాల్లో బయపడ్డ రూ.1.40 కోట్ల నగదు

Sep 24 2026 5:41 PM | Updated on Sep 24 2026 6:15 PM

ACB Raids Ex DSP Bhim Reddy Benami Properties

సాక్షి,హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి ఉదంతంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు ముమ్మరం చేసింది. తాజాగా భీమ్‌రెడ్డికి చెందిన బినామీల ఇళ్లపై ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా నల్లధనం బయటపడింది. 

పుప్పాలగూడలోని భీమ్‌రెడ్డి బినామీ కోమటి వెంకటేష్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.1.04 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం.. రాయదుర్గంలోని పంచవతి కాలనీతో పాటు భీమ్‌రెడ్డి అనుచరుల ఇళ్లలోనూ ఈ సోదాలు చేపట్టింది.

రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులు 
ఈ ఏడాది జులై 2న డీజీపీ ఆఫీస్ స్టేషనరీ వింగ్‌లో పనిచేస్తున్న డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు తొలిసారి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్‌ సహా మొత్తం 16 ప్రాంతాల్లో భీమ్‌రెడ్డి బంధువులు, ఆప్తుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.   ప్రాథమిక అంచనాల ప్రకారం భీమ్‌రెడ్డి స్థిర, చర ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నాటి తనిఖీల్లో దొరికిన నగదును లెక్క తేల్చేందుకు రెండురోజుల సమయం పట్టింది.   

భార్య సెల్‌ఫోనే కీలకం.. డైరీలో బినామీల చిట్టా 
తొలిసారి సోదాలు జరిగిన సమయంలో అధికారులకు ఒక కీలక డైరీ దొరికింది. ఇందులో భీమ్‌రెడ్డికి చెందిన దాదాపు 15 మంది ముఖ్య బినామీల పూర్తి వివరాలు ఉన్నట్లు తేలింది. ఈ కేసులో భీమ్‌రెడ్డి భార్య సెల్‌ఫోన్ అత్యంత కీలక ఆధారంగా మారింది. 

ఆమె ఫోన్‌లో సేవ్ చేసిన కొన్ని ఫొటోల్లో కుటుంబ సభ్యులకు ఏ ఆస్తి కేటాయించాలి, ఏ బినామీ పేరుతో ఏ ఆస్తి ఉంది, ఎవరికెంత ఇవ్వాలి అనే పూర్తి వివరాలు చేతిరాతలో నమోదై ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆ డైరీ, ఫోన్ డేటా ఆధారంగానే అధికారులు ప్రస్తుతం బినామీల ఇళ్లపై వరుసగా దాడులు చేస్తూ ఆస్తుల గుట్టును రట్టు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement