breaking news
DSP Bheem Reddy
-
విచారణకు సహకరించలేదు
సాక్షి, హైదరాబాద్: ‘డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి సోదాల సమయంలో సుమారు రూ.10.12 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులు, బంగారు నగలు, నగదు, బ్యాంకు నిల్వలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటి సామగ్రి బయటపడ్డాయి. లెక్కకు వచి్చన ఆదాయం సుమారు రూ.2.10 కోట్లు, అంచనా ఖర్చు రూ.1.03 కోట్లని లెక్కించాం. మిగిలిన పొదుపుతో పోలిస్తే రూ.9.05 కోట్ల మేర అక్రమ ఆస్తులున్నాయి.వీటిపై సరైన వివరణ ఇవ్వడంతో భీమ్‌రెడ్డి విఫలమయ్యారు. దీంతో ఏసీబీ 1988 చట్టంలోని సెక్షన్ 13(1)(బీ) రెడ్‌విత్ 13(2) కింద అతనిపై అభియోగాలు నమోదు చేశాం. దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇవ్వడంలో అతను సహకరించలేదు’అని కోర్టుకు ఏసీబీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించింది. ఏసీబీ ఇన్స్పెక్టర్ గౌస్ అజాద్ దాఖలు చేసిన నివేదికలోని వివరాలిలా ఉన్నాయి. పలు చోట్ల తనిఖీలు నిర్వహించాం హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మణికొండ, పటాన్చెరు, జూబ్లీహిల్స్, అల్వాల్, గచ్చిబౌలి, గడ్డిఅన్నారం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. భీమ్‌రెడ్డి నివాసంతోపాటు ఆయనతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించాం. ఈ సోదాల్లో విల్లాలు, ఫ్లాట్లు, భూములు, వాణిజ్య స్థలాలు, బంగారు నగలు, లెక్కలోకి రాని నగదు, బ్యాంకు ఖాతాల వివరాలు దొరికాయి. బినామీ ఆస్తులపై కీలక ఆధారాలు.. దర్యాప్తులో భాగంగా నిందితుడు, కుటుంబ సభ్యులు, ఇతర సంబంధిత వ్యక్తులకు చెందిన ఆస్తుల వివరాల వివరాలు సేకరించాం. కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నాం. డిజిటల్ పరికరాల్లోని సమాచారం, వీడియోలు, ఇతర డేటా పరిశీలన కోసం ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపాం. ఆస్తులను ఇతరుల పేర్లపై నమోదు చేసి, అనంతరం పేర్లు మార్చి వాటిని తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలిలోని ప్లాట్, విసెల్లా మెడోస్‌లోని విల్లా, జూబ్లీహిల్స్‌లోని ఫ్లాట్, మణికొండలోని భూమి, పటాన్‌చెరులోని ఆస్తులు, భార్య పేరు మీద ఉన్న ఫ్లాట్, వ్యవసాయ భూమి వంటి ఉన్నాయి. కొన్ని ఆస్తులు బినామీ పేర్లతో, మరికొన్ని ఆస్తులను ముందుగా తన పేరుతో కొనుగోలు చేసి తర్వాత క్యాన్సిలేషన్ డీడ్లతో ఇతరుల పేర్లకు మార్చారు.అతని, కుటుంబ సభ్యుల పేర్లపై 10 బ్యాంక్ ఖాతాలున్నాయి. కొన్ని ఆస్తుల యాజమాన్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోదాల సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటి సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించాం. వైద్య కారణాలతో అరెస్టు ఆలస్యమైంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. మరిన్ని సాక్ష్యాలు, పత్రాలు, బ్యాంకు ఖాతాల పరిశీలన అవసరం. అతను బయట ఉంటే.. విచారణను ప్రభావితం చేసే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరిన్ని అక్రమ ఆస్తులు వెలుగులోకి రావాలంటే 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ అవసరం. కాగా రిమాండ్ రిపోర్టులో పలు ఆస్తులకు సంబంధించి హోంగార్డు లక్ష్మణ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హర్షిత పేర్లను ప్రస్తావించారు. -
DSP భీమ్ రెడ్డి డైరీలో సినీ హీరో పేరు?
-
డీఎస్పీ భీమ్ రెడ్డి కి 14 రోజుల రిమాండ్
-
అవినీతి తిమింగలం.. 2కిలోల బంగారం.. 20 కిలోల వెండి..
-
రూ. 200 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్/మణికొండ/జడ్చర్ల: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డి నివాసంతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు పట్టుబడిన స్థిరాస్తులు, బంగారం, వెండి, నగదు, బ్యాంకు నిల్వలు కలిపి దాదాపు రూ.200కోట్లకుపైనే భీమ్‌రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దీంతో భీమ్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు లో భాగంగా నార్సింగి వేసెల్లా మెడోస్‌లోని భీమ్‌రెడ్డి నివాసంతో సహా మొత్తం 16 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ సెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. డైరీలో బినామీల పేర్లు.. గురువారంనాటి సోదాల్లో ఏసీబీ అధికారులు భీమ్‌రెడ్డి నివాసంలో ఒక డైరీని స్వాదీనం చేసుకున్నారు. అందులో భీమ్‌రెడ్డి రాసుకున్న బినామీ పేర్ల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు మరింత వేగవంతం చేశారు. ఒక బినామీ నివాసంలో రూ.40 లక్షల నగదు సహా 16 ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి. సోదాల్లో భాగంగా భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు 23 విదేశీ మద్యం సీసాలను స్వాదీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం వీటిని ఎక్సైజ్‌శాఖ అధికారులకు అప్పగించారు. భీమ్‌రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలక పోలీస్ స్టేషన్లు, ఆయా డివిజన్లలో బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నారాయణగూడ ఇన్స్పెక్టర్(ఎస్‌హెచ్‌వో)గా, వనస్థలిపురం ఏసీపీగా, పటాన్చెరు డీఎస్పీగా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలోని పలువురు నేతలకు భీమ్‌రెడ్డితో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వనస్థలిపురం, పటాన్చెరులో పోస్టింగ్స్ కోసం గతంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పటాన్‌చెరుకు చెందిన ఓ నేతతో కలిసి పరిసర ప్రాంతాల్లో సివిల్ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు భీమ్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. సోదాల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తులివే.. – ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా. – టెలికాం నగర్లో జీ+2 నివాస భవనం, పెంట్‌హౌస్. – టెలికాం నగర్‌లోని సాయి ప్రభ రెసిడెన్సిలో ఒకఫ్లాట్, గచ్చిబౌలిలోని కాంత్రి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒకఫ్లాట్. – మణికొండలోని ల్యాంకోహిల్స్ రోడ్డులో 500 చదరపు గజాలలో జీప్లస్ 5 కమర్షియల్ కాంప్లెక్స్. – మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో వాణిజ్య సముదాయంలో వాటా, 3,000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్. – తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు. – ప్రగతి రిసార్ట్స్‌లో 500 గజాల నివాస స్థలం. – సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి. – కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూములు.. బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో ఒక ఎకరం భూమి. – నాగోలులోని కామినేని ఆస్పత్రి సమీపంలో 200 గజాల్లో స్థలం. – జీపీఆర్ హౌసింగ్ సొసైటీలో 400 గజాల్లో స్థలం. – పటాన్చెరులో 200 గజాల్లో స్థలం. – వికారాబాద్ జిల్లా మొమిన్‌పేట్ ప్రాంతంలో వెయ్యి గజాల్లో స్థలంతోపాటు రెండు ఎకరాల వ్యవసాయ భూమి. – శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి. – రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి. నగదు, బంగారం, వెండి స్వాదీనం సోదాల్లో భీమ్‌రెడ్డి నివాసంలో రూ.3.60 లక్షల నగదు, అదేవిధంగా సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో రూ.19.91 లక్షల నిల్వలను ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వగ్రామం ఆలూరులోనూ సోదాలు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని డీఎస్పీ భీమ్‌రెడ్డి స్వగ్రామం ఆలూరులోని సొంత ఇంట్లోనూ గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించి పాస్‌బుక్, రిజిస్టర్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. తండ్రి పేరు మీద ఉన్న భూమి వివరాలనూ సేకరించారు. మణికొండలోని స్నేహితుడి ఇంట్లోనూ.. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మెన్ కె. నరేందర్‌రెడ్డి నివాసంలో భీమ్‌రెడ్డికి సంబంధించిన డబ్బు, ఆస్తుల పత్రాలుంటాయనే అనుమానంతో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. రాయదుర్గం సీఐగా భీమ్‌రెడ్డి పనిచేసినప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. భీమ్‌రెడ్డి ఓ ఆస్తిని నరేందర్రెడ్డిపై రిజిస్ట్రేషన్ చేసి తిరిగి దాన్ని రద్దు చేసుకున్న డాక్యుమెంట్ భీమ్‌రెడ్డి నివాసంలో లభించడంతో నరేందర్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు చేసినట్లు సమాచారం. కాగా, నరేందర్‌రెడ్డి నివాసంలో భీమ్‌రెడ్డికి సంబధించి ఎలాంటి పత్రాలు లభించలేదని తెలిసింది. రూ. 5లక్షల నగదు, నరేందర్‌రెడ్డికే సంబంధించిన రెండు ఆస్తుల పత్రాలను పరిశీలించినట్లు తెలిసింది. -
రూ. 200 కోట్లకు పైమాటే!.. డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తుల వేటలో ఏసీబీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో డీజీపీ ఆఫీస్ స్టేషనరీ వింగ్‌లో పనిచేస్తున్న డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం నుంచే ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. భీమ్‌రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల విలువ సుమారు రూ. 200 కోట్ల పైమాటేనని తెలుస్తుండటంతో పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.డీఎస్పీ భీమ్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, అత్యంత ఆప్తులైన బినామీల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు గురిపెట్టారు. హైదరాబాద్, జహీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈ సోదాల సమయంలో ఏసీబీ అధికారులకు ఒక అత్యంత కీలకమైన డైరీ లభ్యమైంది. ఈ డైరీలో డీఎస్పీకి చెందిన దాదాపు 15 మంది ముఖ్య బినామీల పూర్తి చిట్టా ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఒక బినామీ ఇల్లాంటి రహస్య స్థావరం నుంచే రూ. 40 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్ రెడ్డి కేవలం సొంత రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. గచ్చిబౌలిలోని ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను తన కూతురి పేరిట కొనుగోలు చేయగా, బెంగళూరు నగర పరిధిలో ఒక ఎకరం ఖరీదైన భూమి ఉన్నట్లు డాక్యుమెంట్లు లభించాయి. వీటితో పాటు పలు ఓపెన్ ప్లాట్లు, సాగు భూములకు సంబంధించిన కీలక ల్యాండ్ డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.భీమ్ రెడ్డి అక్రమ సామ్రాజ్యం చాలా పెద్దదిగా ఉన్నందున, బ్యాంక్ లాకర్లు, బినామీల ఖాతాలను పూర్తిగా పరిశీలించడానికి మరో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన అక్రమాస్తుల ఆధారాలు లభించడంతో, మరికొద్ది సేపట్లోనే డీఎస్పీ భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


