ఐబొమ్మ రవికి ఊరట | Ibomma Ravi Gets Relief: Nampally Court Allows Operation of Bank Accounts | Sakshi
Sakshi News home page

ఐబొమ్మ రవికి ఊరట

Sep 24 2026 6:01 PM | Updated on Sep 24 2026 6:35 PM

Ibomma Ravi Gets Relief: Nampally Court Allows Operation of Bank Accounts

సాక్షి,హైదరాబాద్: సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ కేసులో నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టులో ఒకేసారి సంతోషం,షాక్‌ తగిలినట్లైంది. పోలీసులు సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను రోజువారీ లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఖాతాల్లో ఉన్న సుమారు రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి మాత్రం కోర్టు నిరాకరించింది.

 తన బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని, కుటుంబాన్ని కూడా పోషించలేకపోతున్నానని రవి తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్ల నగదును కూడా వెంటనే రిలీజ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.

ఖాతాల వాడకానికే గ్రీన్ సిగ్నల్ 
పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రవి తన అవసరాల నిమిత్తం ఆ బ్యాంకు ఖాతాలను సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించుకోవడానికి మాత్రం అనుమతినిచ్చింది. అయితే, ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల నగదును విడుదల చేయడానికి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఖాతాలు ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం దక్కినప్పటికీ, ఆ భారీ మొత్తానికి సంబంధించి ప్రస్తుతానికి ఊరట లభించలేదన్న స్పష్టత వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement