గణేశ్‌ నిమజ్జనం: టీజీఎస్ఆర్టీసీ 24 గంటల పాటు 700 ప్రత్యేక బస్సులు | TGSRTC Deploys 700 Special Buses for Ganesh Immersion | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనం: టీజీఎస్ఆర్టీసీ 24 గంటల పాటు 700 ప్రత్యేక బస్సులు

Sep 25 2026 12:03 AM | Updated on Sep 25 2026 12:03 AM

TGSRTC Deploys 700 Special Buses for Ganesh Immersion

హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్బంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భాగ్యనగరంలో టీజీఎస్ఆర్టీసీ 24 గంటల పాటు వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతుంది.  హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ రూట్లకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. ​ట్రాఫిక్ డైవర్షన్ల కోసం పోలీస్ కంట్రోల్ రూమ్‌లు, 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు జోనల్ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

అత్యవసర సాయం: ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్, వి.వి.విగ్రహం వద్ద ఆర్టీసీ రిలీఫ్ వాహనాలు ఏర్పాటు.​ ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోటి, బషీర్‌బాగ్, ఇందిరా పార్క్, AIR వద్ద ఆర్టీసీ ప్రత్యేక క్యాంపులు.

​అవాంతరాలు లేకుండా: బస్సులకు అత్యవసర మరమ్మతులు చేయడానికి పోలీసు స్టేషన్ల వద్ద 113 మంది డ్రైవర్లు, 87 మంది మెకానిక్‌లను అందుబాటులో ఉంచారు.

​పోలీస్ మార్గదర్శకాలు: ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు సిటీ, అంతర్రాష్ట్ర బస్సుల (APSRTC, KSRTC) రూట్ల మళ్లింపు.

​శనివారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగినా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు వేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement