హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణాలు చేసేవారికి గుడ్‌న్యూస్. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలనీ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
నెలవారీ, రోజువారీ పాసులను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి ఛార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాసుల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఇదీ చదవండి: ఇక ఈ కవలలకు జీవితాంతం పోలీసు ఉద్యోగం రాదు!


