అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం | BRS Strategy Session Begins in Erravelli | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం

Sep 6 2026 3:13 PM | Updated on Sep 6 2026 3:45 PM

BRS Strategy Session Begins in Erravelli

గజ్వేల్‌: ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఏయే అంశాలపై ప్రశ్నించాలన్న అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ హామీలు, పెండింగ్‌ పథకాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ అసెంబ్లీలో నిలదీసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement