ఇక సిరిసిల్ల, సిద్ధిపేటలపై దండయాత్రే: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Key Comments At Nakrekal Public Meeting | Sakshi
Sakshi News home page

ఇక సిరిసిల్ల, సిద్ధిపేటలపై దండయాత్రే: సీఎం రేవంత్‌

Sep 5 2026 7:53 PM | Updated on Sep 5 2026 8:01 PM

CM Revanth Reddy Key Comments At Nakrekal Public Meeting

నల్లగొండ:  నకిరేకల్‌ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్ధిపేట స్థానాలు కూడా తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో సిరిసిల్లకు పోదాం.. అక్కడ కదం తొక్కుదాం అని కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై దండయాత్ర చేస్తామన్నారు సీఎం రేవంత్‌. 

వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 110 స్థానాల్లో గెలుస్తామన్నారు. ఒక ఇవే స్థానాలకు ఎన్నికలు జరిగితే 90 స్థానాల్లో గెలుస్తామన్నారు. దీనిలో భాగంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌లకు రేవంత్‌ సవాల్‌ విసిరారు. 

‘రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?, సిద్ధిపేట.. సిరిసిల్ల అయినా మేం చర్చకు రెడీ. బీఆర్‌ఎస్‌ పదేళ్లు.. మా రెండేళ్లు పాలనను బేరీజు వేసుకోండి.గతంలోని బీఆర్‌ఎస్‌ పథకాలనూ మేం కొనసాగిస్తాం. కొందరు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారు. వచ్చేసారి కూడా తెలంగాణలో ఇందిరమ్మ పాలన వస్తుంది. గోదావరి, కృష్ణా కలిసి పారితే ఎలా ఉంటుందో నకిరేకల్ లో జనాలు అలా వచ్చారు. కొందరు దుర్మార్గులు, సన్నాసులు సీఎం రాజీనామా చేయాలని అంటున్నారు. గంగిరెద్దుల్లా  కాంగ్రెస్ పాలనను విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను బేరీజు వేసుకోండి

గతంలో బీఆర్ఎస్ ప్రకటించిన అన్ని పథకాలను కొనసాగించాం. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని ఏడున్నర వేల కోట్లు మింగారు. చివర్లో రైతు బంధు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ పేరుతో ఎగ్గొట్టారు. రెండు లక్షల రుణమాఫీ చేశాం. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని గతంలో అనలేదా?., సన్న ధాన్యం పండించిన వారికి బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశాం. దమ్ముంటే తండ్రి కొడుకులు, మామా అల్లుళ్లు శాసన సభలో చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు.

ఇదీ చదవండి: 
కొండా సురేఖ మా పార్టీ‍లోకి కూడా వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement