- ఆదివారం హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్
- అదే రోజు NEET-PG పరీక్ష-2026
- పోలీసుల ట్రాఫిక్ అడ్వైజరీ
హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా ఆగస్టు 30న ఉదయం 4.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ఈ పరుగు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభమై, రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలిలోని జి.ఎమ్.సి. బాలయోగి స్టేడియం వరకు కొనసాగుతుంది.
మారథాన్ రన్ మార్గం
పీపుల్స్ ప్లాజా (నెక్లెస్ రోడ్) – రోటరీ – ఎన్‌టిఆర్ మార్గ్ – ట్యాంక్ బండ్ – చిల్డ్రన్స్ పార్క్ – సెయిలింగ్ క్లబ్ – సోనాబీ మసీదు – బుద్ధ భవన్ – సంజీవయ్య పార్క్ – పీపుల్స్ ప్లాజా – రోటరీ – వి.వి. విగ్రహం, ఖైరతాబాద్ – లోక్ భవన్ రోడ్ – సోమాజిగూడ – పంజాగుట్ట ఫ్లైఓవర్ – ఎంజె కాలేజ్ – ఎస్ఎన్‌టి జంక్షన్ – సాగర్ సొసైటీ – కెబిఆర్ పార్క్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ – రోడ్ నంబర్ 45 – కేబుల్ బ్రిడ్జి.
ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు
మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ వైపు నుండి వచ్చే వాహనాలు: నెక్లెస్ రోడ్ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్, మినిస్టర్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.
పంజాగుట్ట, రాజ్ భవన్ నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు: వి.వి. విగ్రహం వద్ద షాదాన్, నిరంకారీ భవన్ మీదుగా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదాన్ నుండి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలు: కె.సి.పి వద్ద తాజ్ కృష్ణా - రోడ్ నం. 10 & 12, క్యాన్సర్ హాస్పిటల్ - ఒడిశా ఐలాండ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలి.
ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు: తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభ పాయింట్ వద్ద ఫ్లైఓవర్ పైకి మళ్లిస్తారు.
లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు: అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ తల్లి, ఇక్బాల్ మినార్ యు-టర్న్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ద్వారా లోయర్ ట్యాంక్ బండ్ / కట్ట మైసమ్మ గుడి వైపు మళ్లిస్తారు.
కర్బాలా వైపు నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: చిల్డ్రన్స్ పార్క్ వద్ద డిబిఆర్ మీదుగా కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుండి సెయిలింగ్ క్లబ్ మీదుగా అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: కవాడిగూడ ఎక్స్ రోడ్ వద్ద డిబిఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. డిబిఆర్ మిల్స్ వద్ద కవాడిగూడ ఎక్స్ రోడ్, గోశాల మీదుగా జబ్బార్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు.
మారథాన్ నెక్లెస్ రోటరీకి చేరుకున్నప్పుడు: బేగంపేట నుండి రాజ్ భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను గ్రీన్‌లాండ్స్ జంక్షన్ వద్ద డి.కె. రోడ్, అమీర్‌పేట్ వైపు మళ్లిస్తారు.
బంజారాహిల్స్ వైపు వెళ్లేందుకు: డి.కె. రోడ్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సిఎల్ - తాజ్ కృష్ణా, రోడ్ నం. 10 & 12, బంజారాహిల్స్ మీదుగా వెళ్లాలి.
జూబ్లీహిల్స్ వైపు వెళ్లేందుకు: డి.కె. రోడ్, అమీర్‌పేట్, మైత్రివనం, యూసుఫ్‌గూడ, వెంకటగిరి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లాలి.
మారథాన్ పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు: పంజాగుట్ట నుండి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్ వద్ద బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు (తాజ్ కృష్ణా, రోడ్ నంబర్ 10 & 12, క్యాన్సర్ హాస్పిటల్, ఒరిస్సా ఐలాండ్ మీదుగా) మళ్లిస్తారు.
మారథాన్ సాగర్ సొసైటీ జంక్షన్‌కు చేరుకున్నప్పుడు: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి పంజాగుట్ట వైపు వచ్చు వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వైపు అనుమతించరు. ఎన్‌టిఆర్ భవన్ వద్ద కుడివైపునకు మళ్లించి క్యాన్సర్ హాస్పిటల్, జహీరా నగర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా పంజాగుట్ట వైపు పంపుతారు.
మారథాన్ ఎన్‌టిఆర్ భవన్ చేరుకున్నప్పుడు: ఫిల్మ్ నగర్, బివిబి జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చు వాహనాలను జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నంబర్ 70 వద్ద హార్ట్ కప్ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 54 మీదుగా రోడ్ నంబర్ 36 వైపు మళ్లిస్తారు.
సైబరాబాద్ కేబుల్ బ్రిడ్జి నుండి వచ్చు వాహనాలు: ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు అనుమతించరు. ఈ వాహనాలను ర్యాంప్ ద్వారా మెగ్నోలియా బేేకరీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 39 మీదుగా రోడ్ నంబర్ 36 వైపు అనుమతిస్తారు.
ఏదైనా అత్యవసర పరిస్థితిలో ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
NEET-PG పరీక్ష-2026 ట్రాఫిక్ అడ్వైజరీ
హైదరాబాద్‌లోని పలు కేంద్రాల్లో ఆగస్టు 30న నిర్వహించనున్న "NEET-PG పరీక్ష-2026" సందర్భంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వల్ప నుండి మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
పరీక్షా కేంద్రాల వివరాలు
ఐఓఎన్ డిజిటల్ జోన్ (iDZ) బండ్లగూడ: మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అరోరా అకాడమీ పక్కన, వ్యాసపురి, చంద్రాయణగుట్ట - కాటేదాన్ రోడ్, బండ్లగూడ, హైదరాబాద్.
ఇన్నోవిజన్ టెక్నాలజీస్: 126 జయా మేన్షన్, 2వ అంతస్తు, ఎస్.డి. రోడ్, ప్యారడైజ్ సర్కిల్, సికింద్రాబాద్, హైదరాబాద్.
మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ: తాజ్‌మహల్ హోటల్ పక్కన, బ్రాండ్ ఫ్యాక్టరీ వెనుక, కింగ్ కోఠి రోడ్, అబిడ్స్, హైదరాబాద్.
జి. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్: షేక్‌పేట్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్.
ట్రాఫిక్ రద్దీ ఉండే జంక్షన్లు (ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు)
ప్యారడైజ్ సర్కిల్, 2) కింగ్ కోఠి, 3) తాజ్‌మహల్ జంక్షన్ (అబిడ్స్), 4) బండ్లగూడ జంక్షన్, 5) సవేరా హోటల్ 'యు' టర్న్, 6) లక్ష్మీనగర్ (మెహఫిల్ హోటల్ జంక్షన్ సమీపంలో), 7) దుర్గానగర్ జంక్షన్, 8) కెఎఫ్‌సి జంక్షన్, 9) రేతిబౌలి, 10) నానల్‌నగర్.
జి. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ (షేక్‌పేట్) పరీక్షా కేంద్రానికి వెళ్లే విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలు
పీపుల్స్ ప్లాజా నుండి గచ్చిబౌలిలోని జి.ఎమ్.సి. స్టేడియం వరకు ఉదయం 4.30 గంటల నుండి 9 గంటల వరకు "హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్-2026" ఉండడంతో, విద్యార్థులు క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
బోరబండ, కళ్యాణ్ నగర్, మధురానగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీల నుండి వచ్చే విద్యార్థులు: వెంకటగిరి, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా వెళ్లి, ఆల్కాజర్ బిల్డింగ్ వద్ద రోడ్ నంబర్ 36లో కలవాలి. అక్కడ 'చట్నీస్' వద్ద 'యు' టర్న్ తీసుకుని, 'క్రీమ్ స్టోన్' వద్ద ఎడమవైపునకు తిరగాలి. అక్కడి నుండి హార్ట్ కప్ జంక్షన్, రోడ్ నంబర్ 51, పక్షి సర్కిల్, న్యాయ విహార్, ఫిల్మ్‌నగర్ (రోడ్ నంబర్ 82) మీదుగా షేక్‌పేట్ చేరుకోవాలి.
కేబుల్ బ్రిడ్జి మీదుగా సైబరాబాద్ వైపు నుండి వచ్చే విద్యార్థులు: ఫ్లైఓవర్‌కు ముందు ఉన్న ర్యాంప్ గుండా వెళ్లి రోడ్ నంబర్ 45, మెగ్నోలియా బేకరీ జంక్షన్ వద్ద కుడివైపునకు తిరిగి రోడ్ నంబర్ 51 (జూబ్లీహిల్స్), పక్షి సర్కిల్, న్యాయ విహార్, ఫిల్మ్‌నగర్ (రోడ్ నంబర్ 82) మీదుగా షేక్‌పేట్ చేరుకోవాలి.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14, 10, 12 నుండి వచ్చే విద్యార్థులు: అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ వైపు ఉన్న వన్-వే మార్గాన్ని ఉపయోగించి, ఫిల్మ్‌నగర్ (రోడ్ నంబర్ 82) మీదుగా షేక్‌పేట్ చేరుకోవాలి.


