సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాలకు వర్షసూచన చేసింది. ఈనేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దానితో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
అదేవిధంగా పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లకింద, హోర్డింగుల వద్ద ప్రజలెవరూ నిల్చోకూడదని సూచనలు చేసింది.


