భగీరథ్‌ ‘ముందస్తు బెయిల్‌’ పిటిషన్‌ కొట్టివేత | Bhagirath Bail Petition Rejected By Telangana High Court | Sakshi
Sakshi News home page

భగీరథ్‌ ‘ముందస్తు బెయిల్‌’ పిటిషన్‌ కొట్టివేత

May 22 2026 12:50 AM | Updated on May 22 2026 12:50 AM

Bhagirath Bail Petition Rejected By Telangana High Court

సాక్షి, హైదరాబాద్‌: పోక్సో’కేసులో బండి సాయి భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు అతని తరఫు న్యాయవాది దాఖలు చేసిన ఉపసంహరణ లేఖను అనుమతించింది. తనపై పేట్‌బషిరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఉపసంహరణకు అనుమతించాలన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది లేఖను పరిశీలించిన న్యాయమూర్తి అంగీకరించారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకునేందుకు అనుమతించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement