ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పిటిషనర్‌కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలని చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం వహించారో చెప్పాలని తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇద్ద రు ఐఏఎస్‌లకు హైకోర్టు ఫామ్–1 నోటీసులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్‌తోపాటు పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కనకరత్నం, కరీంనగర్ రీజియన్ ఎస్‌ఈ లచ్చయ్య, రహమాన్, నర్సింహారావులను హాజరుకావాలని ఆదేశించింది.
జనవరి 9న ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరై వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. హాజరు నుంచి వినహాయింపు పొందేందుకు ఎలాంటి కారణాలు చెప్పవద్దని హెచ్చరించింది. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేసింది. సివిల్ పనులకు సంబంధించి తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వడం లేదంటూ కె.ఆనంద్ అండ్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్‌కు చెల్లించాల్సిన రూ.1,16,51,734ను ఆరు వారాల్లో విడుదల చేయాలని గత ఏప్రిల్‌లో తీర్పునిచ్చింది.
మూడు నెలలు గడిచినా తీర్పును అమలు చేయకపోవడంతో పిటిషనర్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల ను చెల్లించాలన్న తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేద ని న్యాయమూర్తి ప్రశ్నించారు.
గతంలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్, కరీంనగర్ జిల్లా ఎస్‌ఈ, పంచాయ తీ రాజ్ ఇంజనీర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హాజరై ఉత్తర్వు లను అమలు చేస్తామని చెప్పారని.. అయినా నిర్లక్ష్యం వహించడం క్షమించరానిదన్నారు. గతంలో పలుమార్లు కేసు విచార ణకు వచ్చినా ఎలాంటి సమాధానం లేకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఆగ్రహం వ్యక్తం చేశారు.


