హైదారాబాద్్లో భారీ ఆనే లైన్ గేమ్ స్కాంను DGGI అధికారులు గుట్టు చేశారు. ఫిన్ టెక్ ముసుగులో దాదాపు రూ. ఐదు వేల కోట్ల ఈ కుంభకోణం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒపినియన్ వెబ్ సొల్యూషన్స్, వెబ్ విన్ సొల్యూషన్స్ అనే నకిలీ షెల్ కంపెనీలకు నిధులు నిధుల మళ్లించినట్లు పేర్కొన్నారు.
దుబాయి కేంద్రంగా ఆన్ లైన్ గేమ్ దందా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఓటీపీలు లేకుండా నిధులు మళ్లీంచే టెక్నాలజీ వాడి డబ్బులను దారి మళ్లించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జీఎస్టీని ఎగ్గోట్టడానికి ఎస్క్రో ఖాతాలను వాడినట్లు సమాచారం. విగోఫిన్ డైరెక్టర్లు ప్రభుకూమార్, రాజశేఖర్ రెడ్డిలపై పాత్రపై అధికారుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
funinmatch360 మరియు raceje-et247 వెబ్‌సైట్ల ద్వారా అక్రమంగా ఆ దందా సాగినట్లు తెలిపారు. బ్యాంకింగ్ ఏపీఐలను దుర్వినియోగం చేసి, ఆడిట్‌కు దొరక్కుండా కేటుగాళ్లు జాగ్రత్తపడ్డట్లు అధికారులు తెలిపారు .


