గ్రామ పంచాయతీల్లో ‘రిజర్వేషన్ల’పిటిషన్లపై విచారణలో హైకోర్టు
రాజ్యాంగ ఉద్దేశం దెబ్బతినకుండా ప్రభుత్వం చూడాలని హితవు
ప్రజలు లేని వర్గాలకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎన్నికలు ఆగిపోతాయని వ్యాఖ్య
పిటిషన్లను ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ మాధవీదేవి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసమే పంచాయతీ ఎన్నికలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి స్పష్టం చేశా రు. రాజ్యాంగ ఉద్దేశం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జనాభా లేని వర్గాలకు సర్పంచ్, వార్డు స్థానాలను రిజర్వ్ చేస్తే ఎన్నికలు నిలిచి పోయి వాటి ప్రయోజ నానికి భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర వర్గాలకు రిజర్వ్ చేయాలని తాము ఆదేశిస్తే అది ఎన్నికల నిర్వహణ ను ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు.
తమ ముందున్న పిటిషన్లు విసృత పరిణామాలతో ముడిపడి ఉన్నందున వాటిని ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ బుధవారానికి వా యిదా వేశారు. వరంగల్ జిల్లా మహమూద్ పట్నంలో ఆరుగురు ఎస్టీలుంటే సర్పంచ్ పోస్టుతోపాటు 3 వా ర్డులను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యాకూబ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటివే మరో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ టి. మాధవీదేవి విచా రణ చేపట్టి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికలు నిలిచిపోవడం సరికాదు..
‘రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 25న నోటిఫికేషన్ ఇచ్చింది. 2011 జనాభా లెక్క లు, 2014 గణాంకాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను తీసుకొని పాలసీ ప్రకారం, రోస్టర్ రొటేషన్ ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను రిజర్వ్ చేసింది. తమ గ్రామాల్లో రిజర్వేషన్ కులం లేదని కొందరు, అతికొద్ది మందే ఉన్నారని మరికొందరు పిటిషన్లు వేశారు. రిజర్వ్ అయిన కులాల వారు లేకుంటే స్థానాలు ఖాళీగా ఉండే ఉంటాయని.. అలాంటి చోట రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని, సంబంధిత గ్రామాల్లోని ప్రస్తుత జనాభా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్లు కోరుతున్నారు.
2011 జనగణన డేటాను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేశామని, ఇప్పటి డేటాను తీసుకోలేమన్నది అదనపు అడ్వొకేట్ జనరల్ వాదన. ఈ పిటిషన్లలో విచిత్రమైన వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసు కుంటే ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు జరగకపోవడం సముచితం కాదు. వాటిని ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం’అని తీర్పు కాపీలో న్యాయమూర్తి స్పష్టం చేశారు.


