బండి భగీరథ్‌ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి | Court Allows Police Custody to bandi bhageerath | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

May 26 2026 6:26 PM | Updated on May 26 2026 6:55 PM

Court Allows Police Custody to bandi bhageerath

హైదరాబాద్‌: పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ పోలీస్ కస్టడీకి మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు అతడిని మూడు రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరిన్ని నిజాలు రాబట్టే అవకాశం ఉంది. 

కాగా, ఈనెల 16న బండి భగీరథ్‌ను అరెస్టు చేసి, పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అతడిని కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్‌ విచారించారు.

మరోవైపు, భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఇటీవలే హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని భగీరథ్‌ కోరారు. ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై రిలీజ్‌ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement