బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 11:56 AM

బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నిరసన

గచ్చిబౌలి: బండిభగీరథ్‌ను వెంటనే పోలీసులు అరెస్ట్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు తుల ఉమా డిమాండ్‌ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ ముందు బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా విభాగం నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర హోంశాఖా సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్‌ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ ఎప్పుడూ ధర్మరక్షణ, దేశ రక్షణపై చాలా మాట్లాడతారని.. అతని కుమారుడు మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడని, మా బిడ్డను రక్షించాలని కోరిన ఆ తండ్రికి ఏం న్యాయం చేస్తారన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ బేటీ బచావో, బేటీపడావో అని చెబుతుంటారని ఇప్పుడు ఇలాంటి నేరానికి పాల్పిడిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ? చెప్పాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. నేరం చేసిన వ్యక్తిని కాపాడుతున్న బండి సంజయ్‌, సీఎం రేవంత్‌రెడ్డి నేరస్తులేనని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ శేరిలింగంపల్లి సీనియర్‌ నాయకుడు కొమిరిశెట్టిసాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement