ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్‌? | bandi sai bhagirath incident in hyderabad | Sakshi
Sakshi News home page

ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్‌?

May 20 2026 9:11 AM | Updated on May 20 2026 11:30 AM

bandi sai bhagirath incident in hyderabad

సాక్షి, హైదరాబాద్‌: బండి సాయి భగీరథ్‌ పక్కా పథకం ప్రకారమే పోలీసులకు చిక్కాడని కేసు దర్యాప్తులో పాల్గొన్న కీలక పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో ఆధారాలు దొరకకుండా చేయాల్సిన పనులన్నీ పరారీలో ఉండగానే పూర్తి చేసిన తర్వాతే పోలీసుల అదుపులోకి వచ్చాడని చెప్పారు. ఈనెల 16న భగీరథ్‌ను అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

ఠాణాలో రెండున్నర గంటలపాటు కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్‌ నిందితుడిని సుదీర్ఘంగా విచారించా రు. అయితే విచారణ సమయంలో భగీరథ్‌ పోలీసులకు ఖాళీ సెల్‌ఫోన్‌ మాత్రమే అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్‌లో సిమ్‌ లేదని, ఎక్కడుందని విచారణాధికారి నిందితుడిని ప్రశ్ని ంచగా.. సిమ్‌ కార్డ్‌ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు తెలిసింది. విచారణాధికారులు న్యా యనిపుణులతో చర్చించిన అనంతరం పోక్సో కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేశాడని గుర్తించి, భగీరథ్‌పై కొత్తగా ‘ఆధారాలు మాయం’సెక్షన్‌ను జోడించారు. 

ఈ మేరకు ఛార్జ్‌ షీట్‌లో భగీరథ్‌పై బీఎన్‌ఎస్‌ చట్టం సెక్షన్‌ 238ను జోడించారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మేడ్చల్‌ న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్‌ను దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని నార్సింగిలోని సర్వీస్ అపార్ట్‌మెంట్, మెయిన్‌బాద్‌ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాలలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్స్‌ చేయాలని పోలీసులు నిర్ణయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement