‘‘బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి’’ | BRS women meet DGP and submit a petition | Sakshi
Sakshi News home page

‘‘బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి’’

May 13 2026 6:58 PM | Updated on May 13 2026 6:58 PM

BRS women meet DGP and submit a petition

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని డీజీపీకి వినతిపత్రం అందించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రజలకు పోలీసులపై నమ్మకం, విశ్వాసం ఉండాలంటే.. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: సీపీఎం 
బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్‌ చేశారు. మే 14న రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఎం పిలుపునిస్తుందని ఆయన తెలిపారు. పోక్సో కేసు నమోదైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని చెప్పారు. 

పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బండి సంజయ్ తన కుమారుడిని వెంటనే సరెండర్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement