‘ప్రశ్నించకపోతే ఏపీని కూడా బాబు అమ్మేస్తారు’ | Kurasala Kannababu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ప్రశ్నించకపోతే ఏపీని కూడా బాబు అమ్మేస్తారు’

Jul 9 2026 6:21 PM | Updated on Jul 9 2026 6:30 PM

Kurasala Kannababu Fires On Chandrababu

సాక్షి, కాకినాడ జిల్లా: ప్రజల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్‌సీపీ  నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ వర్గాల సమస్యలను పరిష్కరించడం లేదని.. వీటిని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్‌సీపీని దుర్మార్గంగా చూపిండానికి కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు.

‘‘మాటిమాటికి వైఎస్ జగన్‌, వైఎస్సార్‌సీపీని దూషిస్తోంది. వైఎస్ జగన్‌ను దూషించడానికి చంద్రబాబు దిగజారిపోతున్నాడు. 17 ఏళ్ల పాటుగా సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఇది సంస్కారమా?. మీ వ్యవహారంలో తీవ్రమైన ప్రస్టేషన్ ఎందుకు కనిపిస్తోంది. బహిరంగ సభల్లో వైఎస్ జగన్ కుటుంబం కోసం ఎందుకు మాట్లాడుతున్నారు?. వైఎస్సార్‌సీపీ గొడ్డలి పార్టీ అయితే.. మీ పార్టీ బూడిద పార్టీనా?. రాష్ట్ర వనరులు దోచి.. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకలేక బూడిద చేస్తున్న మీమ్మల్ని బూడిద పార్టీ అనొచ్చా?

..సంక్షేమాన్ని, అభివృద్ధిని బూడిద చేశారు. దీనికి డైవర్షన్‌గా రాముడ్ని, రావణ్‌ని తీసుకువస్తారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ మీ సంపద సృష్టి మీ  అనుయాయులకు, కార్పొరేట్‌ సంస్థలకు సంపద సృష్టిస్తున్నారు. రామాయంపట్నం పోర్ట్‌ను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఐదు వేల కోట్లతో శరవేగంగా జగన్  పనులు పూర్తి చేశారు. మరో ఐదు శాతం పనులు పూర్తి చేయాలి. వైఎస్‌ జగన్ నిర్మాణం చేసిన పోర్ట్‌లను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు.

..ఎవరైనా చంద్రబాబుపై గొంతెత్తి ప్రశ్నిస్తే వారిపై దుర్మార్గమైన కేసులు, వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి కొట్టుకుపోయాయి. సాయికృష్ణ తల్లి బూడిద అడిగినా ఇవ్వరు. తునిలో చిన్నారి అదృశ్యమైనా.. విశాఖలో మత్స్యకారులు గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టలేరు. శాంతిబద్రతలు కుప్పకూలిపోతే... రావణ్ లాంటి యూట్యూబర్‌లపై ఉపా చట్టాలను పెడుతున్నారు. పెట్టాల్సిన చట్టాలు కాకుండా.. చట్టాలను అతిక్రమించడానికి మేము వ్యతిరేకం. నాలుగు కేసుల్లో రావణ్‌కు బెయిల్ వస్తే.. ఐదో కేసులో ఉపా చట్టాన్ని పెట్టారు. రావణ్ భావజాలానికి మేము అనుకూలం కాదు. తమ రాజకీయం కోసం రాముడు, రావణ్‌ను వాడుకుంటున్నారు.

..కుల ప్రస్తవన లేకుండా చంద్రబాబు రాజకీయం చేయలేకపోతున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబు హుందాగా ప్రవర్తించాలని చెబుతున్నాము. ఆడబిడ్డ నిధి ఏమైందంటే చెప్పడు.. కానీ  సభల్లో తాను సంక్షేమ పథకాల రథసారధిగా చెబుతారు. రైతుల మీద విపరీతమైన భారాన్ని మోపారు. వైఎస్‌ జగన్ భూములు రీ సర్వే చేయిస్తే మీ భూములు లాగేసుకుంటారంటూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు రేషన్ కార్డుల మీద మీ ఫోటోలు ఉన్నాయి.. అంటే రేషన్ మీరు లాగేసుకుంటారా?. వైఎస్‌ జగన్ తీసుకొచ్చిన పట్టాదారు పుస్తకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది.

..ప్రచారం మీద తప్పా.. ప్రజల అవసరాల‌ మీద దృష్టి పెట్టలేదు. దోచుకోవడం...దాచుకోవడంలో నిమగ్నమయ్యారు. మావిగన్‌లో అన్నీ ఉన్నాయి. మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రశ్నించకపోతే  చివరకు ఏపీని కూడా బాబు అమ్మేస్తారు’’ అంటూ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement