తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయింది: కేటీఆర్‌ | Ex Minister Ktr Comments On Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయింది: కేటీఆర్‌

Jul 9 2026 9:08 PM | Updated on Jul 9 2026 9:12 PM

Ex Minister Ktr Comments On Cm Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్‌ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సొంత సర్వేలో తేలిందన్న కేటీఆర్‌.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు.

78 సీట్లతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్‌ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేల భయంతోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైంది. మరోసారి ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని తెల్చిచెప్పారు.

..సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే మరోసారి ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని.. సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement