రజనీ 172వ సినిమా లైన్లో..! గ్రీన్ సిగ్నల్ పడితే..!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవలే తన 170వ చిత్రం వేట్టైయాన్‌ను పూర్తిచేశారు. ఇందులో ఈయన మాజీ పోలీస్ ఎన్‌కౌంటర్‌గా నటించినట్లు సమాచారం. అమితాబ్‌బచ్చన్, రానా వంటి ప్రముఖ నటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే రజనీ 172 మూవీ!ప్రస్తుతం రజనీకాంత్ తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్‌పైకి వెళ్లనుంది. తాజాగా రజనీకాంత్ 172వ చిత్రానికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. దీన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శింబు గురించి ఏమన్నారంటే?ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన ప్రస్తుతం హిప్హాప్ ఆది హీరోగా పీటీసార్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు గురించి అడిగిన ప్రశ్నకు ఐసరి గణేశ్ బదులిస్తూ శింబు తన చిత్రం 'కరోనాకుమార్'లో నటిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు.గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే షురూఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే త్వరలో రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే తలైవా 172వ చిత్రం ప్రారంభం అవుతుందని ఐసరి గణేశ్ పేర్కొన్నారు.