ధనుష్ మరొకటి.. మామూలు స్పీడ్ కాదు ఇది | Dhanush New Movie Update Announced Next | Sakshi
Sakshi News home page

Dhanush: తమిళ దర్శకుడా? బాలీవుడ్ డైరెక్టరా?

Jul 9 2026 8:58 AM | Updated on Jul 9 2026 9:06 AM

Dhanush New Movie Update Announced Next

పాన్‌ ఇండియా కాదు పాన్‌ వరల్డ్‌ నటుడు ధనుష్‌. ఈయన నటనతో పాటు కథకుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు బాధ్యతలు సక్సెస్‌‌ఫుల్‌‌గా నిర్వహిస్తున్నాడు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ధనుష్ ప్రస్తుతం 'ఓమ్'‌ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. రాజ్‌ కుమార్‌ పెరియస్వామి దర్శకుడు. ఇదలా ఉండగానే మరొకటి ప్రాజెక్ట్ ప్రకటించాడు.

(ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్)

ఇందులో డీ,వీ అనే ఇంగ్లీష్ అక్షరాలు, 10–07–26 అనే తేదీ మాత్రమే ఉన్నాయి. ధనుష్‌ తదుపరి మూవీ సత్యజ్యోతి సంస్థలో చేయబోతున్నట్లు చాలారోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ పోస్టర్‌లో వీ అనే అక్షరానికి దర్శకుడు వెంకట్‌ ప్రభు అనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ అని, విలన్ ఎస్జే సూర్య అని ప్రచారం సాగుతోంది. మరోవైపు '12th ఫెయిల్'తో ఆకట్టుకున్న విదు వినోద్ చోప్రా పేరు కూడా వినిపిస్తోంది. మరి ధనుష్‌తో పనిచేసే ఆ దర్శకుడు ఎవరు?

(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement