లండన్: అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు యూకేను అతలాకుతలం చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. వేడిగాలుల కారణంగా వేల వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ఈ కారణంగా మరణించిన వారి సంఖ్య2,700 కు చేరుకుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ చరిత్రలోనే గడిచిన జూన్ నెలలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది
బ్రిటన్‌ని గత మూడు నెలలుగా అధిక స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. సాధారణంగా చల్లటి వాతావరణం ఉండే ఆ ప్రాంతంలో.. 35 డిగ్రీలకు పైగా ఎండ నమోదు కావడంతో అక్కడి ప్రజలు భరించలేకపోతున్నారు.
మే,జూన్ నెలల్లో రికార్డు స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన మే నెలలోనే లండన్‌లోని క్యూ గార్డెన్స్‌లో అత్యధికంగా 35.1జూన్ 26న లింగ్‌వుడ్‌లో ఏకంగా 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఇది బ్రిటన్ చరిత్రలోనే అధికం నమోదైంది.దీంతో గత జూన్ నెలలో అక్కడి వాతావరణ శాఖ చరిత్రలోనే మొదటిసారిగా వరుసగా మూడు రోజుల పాటు అత్యంత తీవ్రమైన వేడికి సంకేతంగా 'రెడ్ ఎక్స్‌ట్రీమ్ హీట్ వార్నింగ్' జారీచేసింది.
దీంతో అనారోగ్య సమస్యలతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సాధారణంగా బ్రిటన్ చల్లటి వాతావరణం ఉంటుంది. దీంతో అక్కడి ఇళ్లు, ఆసుపత్రులు చల్లటి వాతావరణానికి అనుకూలంగా నిర్మించబడ్డాయి. కనుక ఈ ఎండవేడిమికి తట్టుకునే సదుపాయాలు అక్కడ లేవు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాత్రి వేళల్లో సైతం ఉష్ణోగ్రతలు 20డిగ్రీలకు తగ్గకపోవడంతో తీవ్రఅవస్థలకు గురవుతున్నారు.


