
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష తిరస్కరిస్తూ ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకొచ్చిన రూలింగ్‌ను వైఎస్ జగన్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, స్పీకర్ కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌తోపాటు శాసనవ్యవహారాల కార్యదర్శికి నోటీసులు జారీ అయ్యాయి. జగన్ పిటిషన్ ఆధారంగా ఈ ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకూడదనే ఉద్దేశంతో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫిబ్రవరి 5వ తేదీన ఓ రూలింగ్‌ను తీసుకొచ్చారు. దీనిని సవాల్ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) న్యాయ పోరాటానికి దిగారు.
‘‘స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయి. ఇది స్పీకర్ ఒక్కరి నిర్ణయమే కాదు.. అధికార పార్టీ సమిష్టి నిర్ణయం. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. శాసన వ్యవహారాల మంత్రి కూడా మీడియాతో ఇదే చెప్పారు. స్పీకర్ చేసిన రూలింగ్ నిష్పాక్షికంగా, తటస్థంగా లేదు.
.. ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాగే చట్టంలో కూడా స్పష్టమైన నిర్వచనం ఉంది. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు. అయినా కూడా చట్టంలోని లేని పరిమితిని స్పీకర్ తన రూలింగ్‌లో నిర్దేశించారు. వైఎస్సార్‌సీపీనే ఏకైక ప్రతిపక్ష పార్టీ. ఆ పార్టీ నాయకుడిగా నేనే ప్రతిపక్ష నేతను అవుతాను.
.. ప్రతిపక్షాన్ని అణచివేయడమే స్పీకర్ రూలింగ్ లక్ష్యంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ రూలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలి. వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్షం.. నాకు ప్రతిపక్ష నేత హోదా ప్రకటించేలా స్పీకర్‌ను ఆదేశించాలి’’ అని తన పిటిషన్‌లో వైఎస్ జగన్ కోర్టును(Jagan Petition in AP High Court) కోరారు.
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న అభ్యర్థనను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెండింగ్‌లో ఉంచుతూ వచ్చారు. దీంతో ఈ అంశాన్ని సవాల్ చేస్తూ కిందటి ఏడాది జులైలోనే వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉండగానే.. ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ రూలింగ్ తెచ్చారు. జగన్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ ఆ రూలింగ్‌లో పేర్కొన్నారు. అయితే ఆ రూలింగ్ రాజకీయ ప్రేరేపితంగా ఉందంటూ జగన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌లో.. గతంలో పలు పార్టీలకు, వాటి అధినేతలకు సీట్ల సంఖ్య లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కిన ఉదంతాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇదీ చదవండి: స్పీకర్ అయ్యన్న రూలింగ్ వెనుక..