హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌తో ప్రమాణం చేయిస్తున్న సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ప్రమాణం చేశారు. కోర్టు మొదటి హాలులో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాయ్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి జస్టిస్ రాయ్ బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు.
కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ రాయ్ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివప్రతాప్.. రాష్ట్ర బార్ కౌన్సిల్æ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ రాయ్ మరో న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్‌తో కలిసి ధర్మాసనంలో కేసులను విచారించారు. కాగా.. కలకత్తా హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ అయిన న్యాయమూర్తి జస్టిస్ సుభేందు సమంత ఈ నెల 29న ప్రమాణం చేయనున్నారు.


