సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.


