సాక్షి,విజయవాడ: పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ విధానాలను సరిగా పేర్కొనలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భక్తుల కానుకలు పక్కదారి పట్టడాన్ని సహించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు పేర్కొంది. సలహాలు, సూచనలు తెలపకుండా ఆదేశాలు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.


