సాక్షి, అమరావతి: నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. క్లబ్‌లో గేమింగ్స్‌కు సంబంధించి ఆంక్షలతో ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని పాటించకుంటే చర్యలు తీసుకోవాలని అటు పోలీసులకు స్పష్టం చేసింది.
డిసెంబర్ 22వ తేదీన మ్యాంగో బే క్లబ్‌పై పోలీసులు రైడ్స్ నిర్వహించి.. పేకాట ఆడుతున్న 285 మందిని పట్టుకున్నారు. మొత్తం రూ.34 లక్షల నగదుతో పాటు 128 కార్లు, 40 టూ వీలర్స్ కూడా సీజ్ చేశారు. ఈ కేసులో నాలుగురోజుల కిందట ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
13 కార్డ్స్ పేకాట లేదంటే డబ్బులు పందేలకు ఏ ఆట ఆడవద్దని.. అలా ఆడే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఉత్తర్వులపైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ నడపబడుతోందని గమనిక బోర్డు ఏర్పాటు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


