ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అన్నమయ్య జిల్లా కేంద్రంపై పిల్ | PIL Filed In High Court Against Shifting Annamayya District Headquarters From Rayachoti To Madanapalle | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అన్నమయ్య జిల్లా కేంద్రంపై పిల్

Jan 3 2026 10:52 PM | Updated on Jan 4 2026 4:47 PM

PIL filed against Annamayya district center in Andhra Pradesh High Court

సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా పరిపాలన కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మార్చిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. జిల్లా కేంద్రం రాయచోటుగానే కొనసాగించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వకుండా కేంద్రాన్ని మార్చడం చట్ట విరుద్ధమని పిల్‌లో పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. జిల్లా కేంద్ర మార్పుకు సంబంధించిన జీవో, గెజిట్ నోటిఫికేషన్లను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. కార్యాలయాలు, రికార్డులను మదనపల్లికి మార్చకుండా తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని పిల్‌లో అభ్యర్థించారు.

ప్రతివాదులుగా రెవెన్యూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను చేర్చిన పిటిషనర్. చట్ట నిబంధనల ప్రకారం ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలి. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement