
కృష్ణాజిల్లా: జిల్లాలోని గుడివాడలో ఓజీ సినిమా ప్రదర్శన సందర్భంగా జనసేన నాయకుడు, గుడివాడ చిరంజీవి యువత అధ్యక్షుడు మేక మురళీకృష్ణపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గతరాత్రి ఓజీ సినిమా ప్రదర్శన సమయంలో G3 థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా హాల్లో మద్యం సేవిస్తున్న టీడీపీ నాయకుల్ని.. థియేటర్‌లో మద్యం సేవించొద్దంటూ మురళీకృష్ణ కోరాడు.
ఆడవాళ్లు ఉన్నారని, మద్యం సేవించడం కరెక్ట్ కాదని మురళీకృష్ణ అన్నాడు. దాంతో మద్యం మత్తులో ఉన్న టీడీపీ నాయకులు.. మురళీకృష్ణపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.టిడిపి నేతల పై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు మురళీకృష్ణ. తన స్నేహితుల వల్లే ఈరోజు తాను ప్రాణాలతో ఉన్నానని మురళీకృష్ణ అంటున్నాడు.
