
సాక్షి,అమరావతి: అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ అసమర్ధ పరిపాలనపై జనసేన ఎమ్మేల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ..‘కూటమి వస్తే రోడ్లు వేస్తామని హామీ ఇచ్చాం. రోడ్లు బాగవుతాయని 15 నెలలుగా ఎదురుచూస్తున్నాం. రోడ్లు ఎప్పుడు వేస్తారని ప్రజలు అడుగుతున్నారు. బయట తిరగాలంటేనే కష్టంగా ఉంది’ అంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.