
సాక్షి,తాడేపల్లి: వైఎస్ జగన్‌ను తిట్టిన పట్టాభికి దేవుడి ఆస్తులను అక్రమంగా కట్టబెట్టారు. దేవుడి ఆస్తిని 99ఏళ్ళు లీజుకు ఇస్తారా..? కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా?. దేవుడి ఆస్తులను దొంగలకు దోచిపెడతారా? అంటూ చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఆఫీస్ నుంచి టైప్‌చేస్తే బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయనగరంలో రఘురాముడి తలను ధ్వంసం చేసింది కూటమి సభ్యుడు. నారసింహుడి రథం దహనం కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశాం. అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని పునర్‌నిర్మించింది వైఎస్ జగన్.
ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ,టీడీపీ కలిసి చేసే పాపాలను మర్చిపోదామా?. తిరుమలలో వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన ఘటనను మర్చిపోదామా. తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసిన వారిని మర్చిపోదామా?. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చిన ఘటనను మర్చిపోదామా? గోదావరి పుష్కరాల్లో మరణాలను మర్చిపోదామా?’ అని ప్రశ్నిస్తూ.. తన ప్రెస్‌మీట్‌ను కొనసాగించారు.
టీడీపీ హయాంలో ధ్వంసమైన ఆలయాలను వైఎస్ జగన్ నిర్మించారు. విజయవాడలో 200 ఆలయాలను చంద్రబాబు హయాంలో కూల్చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆలయాలను కూల్చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకు,గ్రావెల్,మట్టి దోచేసి ఇప్పుడు దేవుడు ఆస్తులను కూడా దోచ్చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను తిట్టిన పట్టాభికి దేవుడి ఆస్తులను అక్రమంగా కట్టబెట్టారు. దేవుడి ఆస్తులను దొంగలకు దోచిపెడతారా? అంటూ చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
