పెళ్లి చేసుకుంటానని 12 ఏళ్లుగా నమ్మిస్తూ.. | Woman Complaint on Narsipatnam Janasena Incharge Surya Chandra | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని 12 ఏళ్లుగా నమ్మిస్తూ..

Jan 19 2026 5:30 AM | Updated on Jan 19 2026 5:30 AM

Woman Complaint on Narsipatnam Janasena Incharge Surya Chandra

తండ్రి సూరిబాబుతో కలిసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు లావణ్య , సూర్యచంద్ర

నర్సీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి రాజాన సూర్యచంద్ర మోసం చేశాడని మహిళ ఆరోపణ

ఇంటికి వచ్చి కొట్టాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు

నాతవరం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి రాజాన సూర్యచంద్ర తనపై దాడి చేసి తనను, తన తండ్రిని కొట్టారని ఓ మహి­ళ నాతవరం పోలీసులకు ఆదివారం ఫి­ర్యాదు చే­సింది. బాధితురాలు నాతవరం గ్రామానికి చెంది­న పోలుపర్తి లావణ్య తన తండ్రి పో­లుపర్తి సూ­రిబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ లావణ్యకు గతంలో ఓ వ్యక్తితో వివా­హం జరగ్గా.. తాను పెళ్లి చేసుకుంటా­నని నమ్మించి, భర్తతో విడాకులు తీసుకునేలా జనసేన నేత సూ­ర్యచంద్ర నమ్మించాడు. 12 ఏళ్లుగా వివాహం చేసుకోవాలని ఎన్నిసార్లు అడుగుతు­న్నా సూర్యచంద్ర పట్టించుకోకుండా కాలయాపన చే­స్తు­న్నాడు.

ఆదివారం రాత్రి 9 గంటల సమ­యంలో సూర్యచంద్ర.. లావణ్య ఇంటికి వెళ్లి, గతంలో తాను ఇచ్చిన సెల్‌ఫోన్‌ ఇవ్వాలని అడిగాడు. సెల్‌ఫోన్‌ను ఉద­యం ఇస్తామని లావణ్య తండ్రి చెప్పడంతో సూర్యచంద్ర కోపంతో ఊగిపోయి లావణ్య, ఆమె తండ్రి సూరిబాబును తీవ్రంగా కొట్టి గొడవ చేశా­డు. దీంతో సూ­రిబాబుకు గాయమైంది. ఈ సంఘట­నపై నా­తవరం పోలీసుల­కు ఫిర్యా­దు చేసినట్టు లావణ్య తెలి­పింది.

ఈ విషయంపై నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు­ను సంప్రదించగా.. సూర్యచంద్రపై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని చెప్పారు. తాము చాలాకా­లంగా కలిసి ఉంటున్నామని శనివారం రాత్రి సూ­ర్యచంద్ర మద్యం తాగి గొడవకు దిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేయకుండా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కోరినట్టు ఎస్‌ఐ చెప్పా­రు. కేసు నమోదు చేసేందుకు సంతకం చేయమంటే ఆమె నిరాకరించినట్టు తెలిపారు. ఫిర్యాదురాలి అభీష్టం మేరకు కేసు నమోదు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement