సాక్షి, విజయవాడ: జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో రసాభాస జరిగింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఎదుట తూర్పు నియోజకవర్గ జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది.
వివరాల మేరకు.. జనసేన పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రావి సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సౌజన్య వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు తప్పుబట్టారు. పార్టీలో డబ్బులు వసూలు చేస్తున్నారని సౌజన్యపై ఆరోపణలు చేశారు. దీంతో, తనపై ఆరోపణలు కాదు బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం గందరగోళంగా మారడంతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భాను వారికి సర్ది చెప్పారు.


