సాక్షి, అమరావతి: పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు? అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై స్పందించిన మిథున్.. ఆ ఆరోపణలను నిరూపించాలని పవన్‌కు రీట్వీట్ చేస్తూ సవాల్ విసిరారు.
ఆ భూములను తాము 2000 సంవత్సరంలోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయనీ, వాటిని ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చంటూ మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. ముందుగా వాటిని పరిశీలించి, ఆ తర్వాతే మాట్లాడాలని పవన్‌కు ఆయన హితవు పలికారు. గతంలో కూడా ఎర్ర చందనం విషయంలోనూ పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని మిథున్ గుర్తు చేశారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Mr @PawanKalyan you are good at shooting and scooting. You have done that in the past (remember red sanders remarks made by you) and ran away after I demanded you to prove the allegations. What you have shot from your helicopter is our legitimate land, we bought it in 2000.
— Mithunreddy (@MithunReddyYSRC) November 13, 2025


