తిరుపతి: తిరుపతిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డవారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని టీడీపీ నేల, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పరామర్శించారు.
దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తిరుపతిలో రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. బయట ప్రాంత వ్యక్తుల వచ్చి తిరుపతి ప్రశాంత వాతావరణం దెబ్బతిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలు పుటేజీ బయటపెట్టాలన్నార సుగుణమ్మ. అదే సమయంలో నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


