సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేనకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి.. వైఎస్ జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏబండారు గంగాసురేష్, ఆనెం సుభాష్, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్ సహా పలువురు నేతలు.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాధరావు, జంగారెడ్డిగూడెం వైఎస్సార్‌సీపీ నేత బీవీఆర్ చౌదరి పాల్గొన్నారు.


