సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం కాస్తా కొట్లాటకు దారి తీసింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించివేసినట్టు సమాచారం.

వివరాల మేరకు.. బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ వర్గీయులు.. ప్రభుత్వం స్థలంలో ఉన్న చెట్లు నరికివేశారు. ఈ క్రమంలో చెట్ల నరికివేతపై జనసేన వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం, రెండు వర్గాలతో బుచ్చయ్యపేట ఎమ్మార్వో గ్రామసభ ఏర్పాటు చేశారు. దీంతో, సభలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.

ఎమ్మార్వో నిర్వహించిన గ్రామసభలోనే రెండు వర్గాలు రాళ్ల, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడి పలువురు కార్యకర్తలకు గాయాలైనట్టు సమాచారం. తలలు పగిలినట్టు తెలిసింది. అయితే, పోలీసులు సమయంలో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


