యువతులతో యలమంచిలి ఎమ్మెల్యే సోదరుడి అసభ్యనృత్యాలు
ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
ఉత్తరాంధ్ర జనసేన ఇన్‌ఛార్జి సతీష్‌కుమార్ తీరుపై విమర్శలు
సాక్షి, అనకాపల్లిః తమవారైతే ఏం చేసినా ఓకే.మనోళ్లయితే చట్టం మనకు చుట్టమే.వేరే పార్టీ వారైతే మాత్రం చట్టం తనపని తాను చేసుకుపోతుంది.ఇది ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వున్న కూటమి ప్రభుత్వ అంతరార్ధం. హోం మంత్రిగా వున్న వంగలపూడి అనిత సొంత జిల్లాలో జనసేన నేతలు బరితెగించారు.యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సుందరపు సతీష్‌కుమార్ అసభ్య చేష్టలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడమే ఇందుకు సాక్ష్యం.
