ఒక కంటెంట్ క్రియేటర్ సరదాగా కాఫీస్టాల్‌తో ఎంత ఆర్జింగలమో తెలుసుకోవాలనుకున్నాడు. కార్పొరేట్ ఆఫీస్ వద్ద చిన్న స్టాల్ పెట్టి ట్రై చేసి చూడు. మరి ఎంత సంపాదించాడో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. అంతేగాదు కార్పొరేట్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బెటరేమో అనిపిస్తుంది కూడా.
40 ఏళ్ల త్యాగి అనే కంటెంట్ క్రియేటర్ రద్దీగా ఉండే ఆఫీస్ ప్రాంతాల వద్ద టీ, కాఫీ, స్నాక్స్ అమ్మే స్టాల్స్ కనిపిస్తుంటాయి. కానీ ఆ స్టాల్స్ ఒక్క రోజులో ఎంత మేర సంపాదించగలవో తెలసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఒక కార్పొరేట్ ఆఫీస్‌కి సమీపంలోని రోడ్డు వద్ద కాఫీ స్టాల్స్ పెట్టి మరి ట్రై చేసి చూశాడు. ఒక టేబుల్ గ్యాస్ స్టవ్, ఇన్‌స్టంట్ కాఫీ, కప్పులు, పాత్రలు, పాలు, ఇతర పాత్రలు సిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత అదంతా వీడియో తీసేలా సెటప్ చేసుకున్నాడు.
ముందుగా కార్పొరేట్ ఆఫీస్ బయట కాఫీ అమ్మి ఎంత సపాందించవచ్చో చూద్దాం అని సంభాషిస్తూ తన పనిని ప్రారంభించాడు. ఉదయం 10 గంటల కల్లా తన షాపు రెడీ చేసుకున్నాడు. ఆతర్వాత గ్యాస్ మీద పాలు మరిగించి కస్టమర్లకు కేఫ్‌లాంటి కాఫీ అనుభూతిని అందించడం మొదలుపెట్టాడు. ఒక్కో కప్పు ధర రూ. 40లు నిర్ణయించి సర్వ్ చేయడం ప్రారంభించాడు. ఉదయం ఆఫీస్ బ్రేక్ టైంలో కస్టమర్లకు సర్వ్ చేస్తూ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాడు.
వాళ్లందరూ ఫీడ్‌బ్యాక్ బాగుందనే ఇచ్చారు. మొదటి రెండు గంటల్లో 40 కప్పులు అమ్ముడవ్వగా..మధ్యాహ్నం వ్యాపారం నెమ్మదించి మళ్లీ పుంజుకుంది. ఆ రోజు సాయంత్రం రద్దీ మొదలై..ఉద్యోగులు బయటకు రావడంతో కాఫీకి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఆర్డర్లు పెరుగుతుండటంతో వేగంగా అందించేందుకు ప్రయత్నించాల్సి వచ్చింది త్యాగికి.
చివరకు తెచ్చుకున్న కాఫీ నిల్వలు అయిపోయాయి. రోజు ముగిసే సమయానికి ఏకంగా 450కి పైగా కప్పులు అమ్ముడవ్వగా..రూ. 18వేలు వరకు సంపాదించగలిగాడు. అయితే దీన్ని ఒక్కరోజులో వచ్చిన ఆదాయంగా పరిగణించలేం ఎందుకంటే..స్టాల్ నిర్వహణకు, ముడి సరుకులు, పరికరాలు లేదా ఇతర ఖర్చులు వివరాలను బట్టి ఇది లాభసాటి వ్యాపారమైనా కాదా అని నిర్ణయించాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: 1952లో గీసిన చిత్రం..74 ఏళ్ల తర్వాత ఏకంగా రూ. 65 కోట్లు!)


