1952లో గీసిన చిత్రం..74 ఏళ్ల తర్వాత ఏకంగా రూ. 65 కోట్లు! | In 1952 MF Hussain painted Red Girl it sells for Rs 65 crore at Mumbai auction | Sakshi
Sakshi News home page

1952లో గీసిన చిత్రం..74 ఏళ్ల తర్వాత ఏకంగా రూ. 65 కోట్లు!

Oct 4 2026 1:05 PM | Updated on Oct 4 2026 1:10 PM

In 1952 MF Hussain painted Red Girl it sells for Rs 65 crore at Mumbai auction

ప్రఖ్యాత చిత్రకళాకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కుంచె నుంచి జాలువారిన ఎన్నో చిత్రాలు కోట్లలో అమ్ముడిపోయి అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆయన గీసే చిత్రాల్లో ఆధునికత తోపాటు..నాటి శిల్పకళా వైభవాన్ని కళ్లకు కట్టి చూపేలా..గొప్పే దృశ్య కథను వివరించడం విశేషం. ఇప్పుడ తాజాగా 1952లో కాన్వాస్‌పై తైలవర్ణ చిత్రంగా గీసిన ‘ది రెడ్ గర్ల్’, పెయింటింగ్‌ వేలంలో 65 కోట్లకు అమ్ముడిపోవడంతో మరోసారి ఆయన పేయింటింగ్‌లు అంశం మరోసారి వెలుగులోకి వచ్చి హాట్‌టాపిక్‌గా మారాయి. 

సెప్టెంబర్‌ 24న ముంబైలో ముంబైలోని పుండోల్స్ ఫైన్ ఆర్ట్ సేల్‌లో  ‘ది రెడ్ గర్ల్’, పెయింటింగ్‌ అంచనా వేసిన ధరకు 13 రెట్టు ఎక్కువకు అ‍మ్ముడవ్వడం విశేషం.  హామిల్టన్ హౌస్‌లో జరిగిన 81 ఆధునిక, సమకాలీన భారతీయ కళాకృతుల వేలంలో ఇది అత్యధిక ధరకు అమ్ముడైన చిత్రంగా నిలిచింది. 48 x 23 7/8 అంగుళాల కొలతలున్న ఈ పెయింటింగ్, వేలానికి ముందు ఇది సుమారు రూ. 3 నుంచి రూ. 5 కోట్లకు అమ్ముడవుతుందని అంచనా వేయగా..ఊహించని రేంజ్‌లో ధరలో అమ్ముడుపోయి..అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆయన గీసిన కొన్ని చిత్రాలు గతంలో కూడా ఇంతకు మించిన రేంజ్‌లో అమ్ముడిపోయిన రికార్డులు నెలకొల్పాయి కూడా. 

ఈ చిత్రంలో దాగున్న విశేషం..
ది రెడ్ గర్ల్' చిత్రం పూర్తిగా ముదురు మట్టి రంగు ఎరుపులో చిత్రించిన స్త్రీరూపం. ఇది ప్రాచీన భారతీయ శిల్పకళలోని యక్షి రూపాలతో, ముఖ్యంగా మధుర సంప్రదాయంతో ముడిపడి ఉన్న వాటితో సంబంధం కలిగినదని తెలుస్తోంది. ఇక ఎరుపురంగు తొలి భారతీయ శిల్పాల్లో ఉపయోగించిన ఇసుకరాయిని గుర్తుకు తెస్తుంది. 

అంతేగాదు ప్రాచీర శిల్పాల విరిగిన లేదా అసంపూర్ణరూపాన్ని గుర్తకు తెస్తుంది ఆ చిత్రం. తోటి కళాకారుడైన ఎఫ్.ఎన్. సౌజాతో కలిసి న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంను సందర్శించినప్పుడు హుస్సేన్‌కు భారతీయ శిల్పకళతో కలిగిన పరిచయంతో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. ఒకరకంగా ఈ చిత్రం భారతదేశ గత శిల్పకళా వైభవం తోపాటు ఆధునిక భారతీయ కళ ఎలా ఉండవచ్చు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఒక తరం కళాకారుల దృశ్య భాషకు మధ్య నిలిచే ఒక కళాఖండంగా ఆవిష్కృతమైంది. 

ఇదీ చదవండి: హైబీపీని అదుపులో పెట్టే పొటాషియమ్‌!
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement