వ్యాపారం చేయాలనే ఆలోచన ఒక్కొక్కరికి ఒక్కోలా తడుతుంది. అవసరం వ్యాపారంలోకి దింపితే..అనుకోకుండా వెళ్లిన ప్రదేశం లేదా రుచి చూసిన ఆహార పదార్థాల వల్లో వస్తుంది. ఇతడి రెస్టారెంట్‌లో అందించిన భోజనం ద్వారా అట్రి బిజినెస్ చేయాలనుకున్నాడు. అలా అని అమాంతం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడలేదు. చిన్నగా ప్రయోగాలు చేస్తూ..సంస్థగా మార్చి ఏకంగా లక్షలు ఆర్జించే రేంజ్‌కు చేరుకుని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచాడు.
అతడే కొచ్చికి చెందిన అజయ గోపినాథ్. బెంగళూరులోని ఒక రెస్టారెంట్‌కి వెళ్లిన మైక్రోగ్రీన్స్ గురించి తెలుసుకున్నాడు. మైక్రోగ్రీన్స్ అంటే మొక్క తోటకూర లాంటి ఆకుకూరలు. వీటిని వంటకాలను అలంకరించడానికి, రుచి, పోషకాల కోసం విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆ చిన్న ఆకుకూరల్లో ఉండే పోషక విలువల మీద ఆసక్తితో ఒకపక్క బ్యాంకు ఉద్యోగం చేస్తూనే చిన్న చిన్న ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందే ఇంటి వద్ద వాటిని పెంచుతూ..వాటి గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
అలా రెండేళ్లు సాగు, పరిశోధనలతో గడిపేశాడు. అయితే తొలి ప్రయత్నంలో పెసలు పండించడానికి టిష్యూలు ఉపయోగిస్తే ఫలితం అంత బాగా రాలేదు. ఆన్‌లైన్‌లో తెలుసుకుందామాన్న..అది కూడా అంతగా ప్రయోజనం కనబడలేదు. దాంతో యూకేలోని ఒక మైక్రో నిపుణిడి సలహా తీసుకున్నాడు. సరైన విత్తనాలు ఎంచుకోవడం ఎలాగో తెలసుకున్నాడు. ముఖ్యంగా జన్యుపరంగా మార్పుచేయని హైబ్రిడ్ కాని రసాయనాలతో శుద్ధి చేయని, సహజ పరాగసంపర్కం చెందనివి ఎంచుకోవాలని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరు, పూణే, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రదేశాల నుంచి విత్తనాలను సేకరించి, క్రమంగా తన సాగు ప్రక్రియను మెరుగుపరుచుకున్నాడు.
సరైన పరిస్థితులను కల్పించడం, స్థిరమైన రుచి, నాణ్యతతో ఆకుకూరలను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాడు. అందుకోసం తన ఇంట్లోనే జస్ట్ 80 చదరపు అడుగుల గదినే వ్యవసాయ క్షేత్రంగా మార్చాడు. ఈ ఏర్పాటు కేవలం రెండు ర్యాక్‌లు, కొన్ని ట్రేలతో ప్రారంభమైంది. మైక్రోగ్రీన్‌లను సాపేక్షంగా చిన్న స్థలంలో పెంచవచ్చు, కానీ విజయవంతమైన సాగుకు పెరిగే పరిస్థితులు, ఉష్ణోగ్రత, విత్తనాల నాణ్యతపై శ్రద్ధ అవసరం. అజయ్ కొన్ని రకాలతో ప్రారంభించి, క్రమంగా వాటి పరిధిని విస్తరించేందుకు బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత గ్రో గ్రీన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు.
దాంట్లో ఇప్పుడు ముల్లంగి, ఆవాలు, పొద్దుతిరుగుడు పువ్వు, బీట్‌రూట్ వంటి మైక్రోగ్రీన్‌లను సాగు చేస్తోంది. ఈ వ్యవసాయ క్షేత్రం ప్రతిరోజూ సుమారు 5 కిలోల తాజా మైక్రోగ్రీన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆకుకూరలను పురుగుమందులు లేదా ఎరువులు లేకుండా పండిస్తుండటం విశేషం. ఈ సంస్థలో సుమారు 35కి పైగా వివిధ రకాల మైక్రోగ్రీన్‌లను పండిస్తోంది. దీంతో అతడు నెలకు రూ. 5 లక్షలు పైనే ఆర్జిస్తుండటం విశేషం.
ఇదీ చదవండి: ఒక్క రోజులో 450 కప్పులు అమ్మి..రూ. ఏకంగా 18 వేలు ఆదాయం..!


