మంచు లక్ష్మీ పేరు మార్చుకుంటుందట..! | Manchu Lakshmi About Everyone Calling Her As Akka | Sakshi
Sakshi News home page

మంచు లక్ష్మీ పేరు మార్చుకుంటుందట..!

Jan 10 2017 3:06 PM | Updated on Sep 5 2017 12:55 AM

మంచు లక్ష్మీ పేరు మార్చుకుంటుందట..!

మంచు లక్ష్మీ పేరు మార్చుకుంటుందట..!

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగానే కాదు నిర్మాతగానూ, బుల్లితెర యాంకర్ గానూ

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగానే కాదు నిర్మాతగానూ, బుల్లితెర యాంకర్ గానూ ఆకట్టుకుంటున్న లక్ష్మీ ప్రసన్నకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎక్కువగా మంచువారమ్మాయిని అక్క అని సంబోధిస్తుంటారు జనాలు. కొంత మంది సరదాగా అక్కా అని పిలుస్తే.., మరి కొంత మంది గౌరవంతో పిలుస్తున్నారు.

ఇన్నాళ్లు ఆ పిలుపును సరదాగానే తీసుకున్న లక్ష్మీ ప్రసన్నకు గత వారాంతంలో ఎదురైన అనుభవం చిరాకు తెప్పించింది. దీంతో తన సోషల్ మీడియా పేజ్లో అక్క అన్న పిలుపుపై ఘాటుగా స్పందించింది. 'ఓ పళ్లు లేని ముసలాయన అక్కా అని పిలవటంతో నేను నా పేరును అక్క అని మార్చుకోవాలని నిర్ణయించుకున్న. అక్క తొక్కా' అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఆ పిలుపు తనకు ఎంత చిరాకు తెప్పించిందో రకరకాల ఎమోట్ ఐకాన్ల రూపంలో చూపించింది. మరి లక్ష్మీ మెసేజ్ చూసాక అయినా జనాలు అక్క అని పిలవటం మానేస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement