బైటింగ్ బ్యాక్
పాము కాటేస్తే ప్రాణాలు పోతాయని భయం. కానీ ఇక్కడ సీన్ రివర్స్! ఓ చిన్న దోమ పాముకే చుక్కలు చూపిస్తూ.., దాని రక్తాన్ని జుర్రుకుంటోంది! అదేంటో ఓ లుక్కేద్దాం పదండి!
పాము కాటేస్తుంది. మరి పాముకు కాటేసేవాళ్లు ఎవరు? మేమున్నాంగా అంటోంది ఈ దోమ. పాముకే తిరిగి కాటేస్తూ.. తగ్గేదేలే అంటూ దాని విషపూరితమైన రక్తాన్ని స్ట్రా పెట్టినట్లు తాగేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రియా కోస్టారికాలో ఈ చిత్రాన్ని తీశారు.
‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పోటీలో యానిమల్ పోట్రేట్ విభాగంలో ఈ చిత్రానికి జ్యూరీ ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి ఫొటోగ్రాపర్ పెట్టిన పేరు.. బైటింగ్ బ్యాక్. అయితే.. ఓ డౌటు.. పాము రక్తాన్ని తాగిన దోమ చచ్చిందా? లేక దోమ ఎఫెక్ట్‌కు పాముకే డెంగీ వచ్చి చచ్చిందా?.. లేదా రెండూ చచ్చాయా.. ఏమో మరి.. ఆ విషయం ఆండ్రియాకే తెలియాలి మరి.
ఇదీ చదవండి: 2,200 ఏళ్ల నాటి మట్టి సైన్యం.. ఈ అద్భుతం చూశారా?


