రిజర్వేషన్.. కుటుంబసభ్యుల రొటేషన్!
● 30వ వార్డు మాజీ కౌన్సెలర్ బీజీ శంకర్‌సింగ్ ఇప్పటివరకు ఏడుసార్లు పోటీ చేశారు. ఆరుసార్లు విజయం సాధించగా.. ఒకసారి ఓటమి చవి చూశారు. ఆ కుటుంబం నుంచి మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. మున్సిపాలిటీ ఏర్పడిన 1987లో తొలి ఎన్నికల్లో, 1992లో సీపీఐ పక్షాన పోటీ చేసి శంకర్‌సింగ్ కౌన్సిలర్ అయ్యారు. 2001లో టీడీపీ అభ్యర్థిగా ఆయన భార్య కరుణాబాయి పోటీ చేసి గెలిచింది. 2005లో శంకర్ సింగ్ టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి కౌన్సిలర్ అయ్యారు. అదేఏటా వైస్ చైర్మన్ అయ్యారు. 2014లో బీఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి కరుణాబాయి ఓటమి పాలైంది. 2020 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె అనా రోగ్యంతో 2021 ఏప్రిల్ 1న మృతిచెందింది. అదేనెలలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తన కూతురు శుకేసిని భరద్వాజ్‌ను పోటీ చేయించి కౌన్సిలర్‌గా గెలిపించుకున్నారు.
● 31 వార్డుకు చెందిన గెల్లి రాజలింగు ఆరుసార్లు పోటీచేసి ఐదు పర్యాయాలు కౌన్సిలర్‌గా విజయం సాధించగా ఓసారి ఓటమి చూశారు. 1987లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 3 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1992లో ఎన్నికై వైస్ చైర్మన్ అయ్యారు. 2001లో జరిగి న ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి విజయం సాధించారు. 2005లో భర్త, 2014లో భార్య, 2020లో నిర్వహించిన ఎన్నికల్లో రాజలింగు కౌన్సిలర్‌గా విజయం సాధించారు.
బెల్లంపల్లి: మున్సిపాలిటీలో రెండు కుటుంబాలు ఏళ్ల తరబడి నుంచి పురఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తున్నాయి. ఓ మారు తప్పా పోటీ చేసిన ప్రతిసారి జయకేతనం ఎగురవేయడం జరుగుతోంది. రిజర్వేషన్ ప్రకారం భార్యభర్తలు, కుటుంబ సభ్యులు పోటీచేసి కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. ఓ కుటుంబం ఆరుసార్లు కౌన్సిలర్‌గా గెలవగా, మరో కుటుంబం ఐదుసార్లు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహించడం విశేషంగా చెప్పవచ్చు.
గెల్లి రాజలింగు
బీజీ శంకర్‌సింగ్
1/1
రిజర్వేషన్.. కుటుంబసభ్యుల రొటేషన్!