క్యాతనపల్లిలో అన్ని స్థానాల్లో సీపీఐ పోటీ
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లిలో అన్ని స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐకి పొత్తు ఉందని, అయితే ఇక్కడ మిత్రధర్మాన్ని విస్మరిస్తే కలిసి వచ్చే సెక్యులర్ పార్టీలతో ముందుకు వెళ్తామని అన్నారు. అన్ని వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు పార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి శ్రీనివాస్, పౌల్, వనం సత్యం, రాజేశం పాల్గొన్నారు.


