ఉద్యోగులపై పని భారం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై పని భారం తగ్గించాలి

Jan 28 2026 8:27 AM | Updated on Jan 28 2026 8:27 AM

ఉద్యోగులపై పని భారం తగ్గించాలి

ఉద్యోగులపై పని భారం తగ్గించాలి

పాతమంచిర్యాల: బ్యాంక్‌ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ఒప్పందాలను గౌరవించాలని యునైటెడ్‌ ఫో రం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ రీజినల్‌ సెక్రటరీ కొ క్కుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం దే శవ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంక్‌ ఉద్యోగులు జి ల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి రెడ్డి కాలనీలోని ఎ స్‌బీఐ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీని వాస్‌ మాట్లాడుతూ.. ఐదురోజుల పని విధానం అమలు చేస్తామని 2024 మార్చిలో జరిగిన 12వ వే తన సవరణ చర్చల సందర్భంగా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ఒప్పందం చేసుకున్నా ఇప్పటివర కు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో బ్యాంక్‌ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. వెంటనే న్యాయమైన డిమాండ్లు పరిశీ లించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ స్టేట్‌ యూబీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.వసంత్‌కుమార్‌, డిప్యూటీ రీజినల్‌ సెక్రటరీ నీలం రమేశ్‌, తె లంగాణ స్టేట్‌ కెనరా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.విష్ణుచరణ్‌, ఎల్‌డీఎం తిరుప తి, ఏఐడీవోసీ రీజినల్‌ సెక్రటరీ ఆర్‌ఎస్‌ వెంకటేశ్‌, బ్యాంక్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement